Share News

Liquor Scam Investigation: నాటి ఎక్సైజ్‌ మంత్రి నారాయణస్వామికీ సిట్‌ పిలుపు

ABN , Publish Date - Jul 19 , 2025 | 03:53 AM

జగన్‌ హయాంలో ఎక్సైజ్‌ శాఖ నిర్వహించిన అప్పటి ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామికి మద్యం కుంభకోణం కేసులో...

 Liquor Scam Investigation: నాటి ఎక్సైజ్‌ మంత్రి నారాయణస్వామికీ సిట్‌ పిలుపు

  • మద్యం స్కాంలో ఎల్లుండి రావాలని నోటీసు

అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో ఎక్సైజ్‌ శాఖ నిర్వహించిన అప్పటి ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామికి మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నోటీసులు జారీ చేసింది. సోమవారం (21న) ఉదయం విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో తమ ముందు సాక్షిగా హాజరుకావాలని అందులో పేర్కొంది. ఆయన ఎక్సైజ్‌ మంత్రిగా ఉన్నప్పుడే రూ.వేల కోట్ల కుంభకోణం జరిగింది. దీనిపై విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆయనకు సిట్‌ నోటీసు పంపింది.

Updated Date - Jul 19 , 2025 | 03:56 AM