Share News

EX Deputy CM Narayanaswamy: కసిరెడ్డి ఎవరో నాకు తెలియదు

ABN , Publish Date - Aug 24 , 2025 | 06:19 AM

మద్యం కుంభకోణంలో అరెస్టయిన కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఎవరో తనకు తెలియదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు.

EX Deputy CM Narayanaswamy: కసిరెడ్డి ఎవరో నాకు తెలియదు

  • మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

తిరుపతి(జీవకోన), ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో అరెస్టయిన కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఎవరో తనకు తెలియదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. సిట్‌ అధికారుల విచారణ నేపథ్యంలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘సిట్‌ అధికారుల ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్పా. అయితే ఇంట్లో లాప్‌టాప్‌ తీసుకెళ్లారని, రికార్డులు సీజ్‌ చేశారని, రూ.8 కోట్లు డబ్బులు లెక్కిస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. నేను డబ్బుకు, పదవికి ఆశపడను. నా మైండ్‌సెట్‌ సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు. పోలీసు వ్యవస్థ దారుణంగా దిగజారింది’ అని నారాయణస్వామి మండిపడ్డారు.

Updated Date - Aug 24 , 2025 | 06:19 AM