Former CM YS Jagan Celebrates Christmas: కుటుంబంతో క్రిస్మస్ వేడుకల్లో జగన్
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:05 AM
మాజీ సీఎం వైఎస్ జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పులివెందులలోని సీఎ్‌సఐ చర్చికి వచ్చారు.
పులివెందుల, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్ జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పులివెందులలోని సీఎ్‌సఐ చర్చికి వచ్చారు. తల్లి విజయలక్ష్మి, సతీమణి భారతితో కలసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి విజయలక్ష్మి, జగన్‌కు కేక్ తినిపించి ముద్దాడారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన చర్చిలో ఉన్న వారందరినీ పలకరిస్తూ బయటకు వచ్చారు. చర్చి బయట ప్రజలు, అభిమానులు పెద్దఎత్తున ఆయన్ను కలిసేందుకు ఎగబడ్డారు. కానీ అస్వస్థతతో ఉండడంతో ఎవ్వరినీ కలవకుండా అందరికీ అభివాదం చేస్తూ వాహనం ఎక్కి రోడ్డు మార్గాన బాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. 11.15 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు వెళ్లిపోయారు. దీనితో మాజీ సీఎం జగన్ మూడు రోజుల పర్యటన ముగిసింది. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ ప్రకాశ్‌రెడ్డి, వైఎస్ ప్రతా్‌పరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.