NV Ramana: శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:20 AM
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితుల ఆశీర్వాదం పొందిన ఆయనకు అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.
తిరుమల, ఏప్రిల్21(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. దర్శనం తర్వాత అఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయ సమర్పించి నమస్కరించుకున్నారు.