Share News

Inspection Team: 29న పోలవరానికి విదేశీ నిపుణులు

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:54 AM

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం గ్యాప్‌-1 నిర్మాణ పనుల పరిశీలనకు విదేశీ నిపుణులు ఈ నెల 29న రానున్నారు.

Inspection Team: 29న పోలవరానికి విదేశీ నిపుణులు

అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం గ్యాప్‌-1 నిర్మాణ పనుల పరిశీలనకు విదేశీ నిపుణులు ఈ నెల 29న రానున్నారు. అమెరికాకు చెందిన జియాస్‌ ప్రాన్కో డి సిస్కో, డేవిడ్‌ బి.పాల్‌, కెనడాకు చెందిన రిచర్డ్‌ డొనెల్లీ పోలవరం ప్రాంతంలో పర్యటించనున్నారు. వీరితో పాటు కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్‌ గౌరవ్‌ సింఘాల్‌, కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌ఎస్‌ బక్షి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్యకార్యదర్శి రఘురాం, జలసంఘం డైరెక్టర్‌ రాజేశ్‌ తొటేజా, సీఎ్‌సఎంఆర్‌ఎ్‌సకు చెందిన మనీశ్‌ గుప్తా కూడా పోలవరానికి వస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ దాకా ఈ బృందాలు అక్కడ పర్యటిస్తాయి.

Updated Date - Aug 27 , 2025 | 05:55 AM