Share News

అహోబిలేశుడి సన్నిధిలో విదేశీ భక్తులు

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:32 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి వసంతోత్సవాలలో శుక్రవారం రష్యా దేశానికి చెందిన విదేశీ భక్తులు పాల్గొన్నారు.

 అహోబిలేశుడి సన్నిధిలో విదేశీ భక్తులు

ఆళ్లగడ్డ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి వసంతోత్సవాలలో శుక్రవారం రష్యా దేశానికి చెందిన విదేశీ భక్తులు పాల్గొన్నారు. విదేశీ పర్యాటకులు సాంప్రదాయ దస్తులు ధరించి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి స్వామివారి హారతి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనతరం ఎగువ ఆహోబిలం క్షేత్రంలో కూడా విదేశీ భక్తులు శ్రీ స్వామి వారిని ద ర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Apr 26 , 2025 | 12:32 AM