Share News

రేపటి వెలుగుల కోసం..నేటి సంకల్పం..!

ABN , Publish Date - Dec 31 , 2025 | 10:51 PM

ఓ వసంతం బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు కాలగమనంలో ఒదిగిపోయింది. మధుర జ్ఞాపకాలను పదిలం చేసుకొని.. చేదు నిజాలను కాలగర్భంలో కలిపేస్తూ 2025కు వీడ్కోలు పలికారు.

   రేపటి వెలుగుల కోసం..నేటి సంకల్పం..!

అభివృద్ధి పథంలో మరో అడుగు

సరికొత్త లక్ష్యాలతో 2026లో అడుగులు

కర్నూలు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఓ వసంతం బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు కాలగమనంలో ఒదిగిపోయింది. మధుర జ్ఞాపకాలను పదిలం చేసుకొని.. చేదు నిజాలను కాలగర్భంలో కలిపేస్తూ 2025కు వీడ్కోలు పలికారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని సరికొత్త ఆశయాలతో 2026 వసంతంలోకి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం అడుగులు వేసింది. ప్రజల ఆకాంక్షలే మా లక్ష్యాలు అంటూ రేపటి వెలుగుల కోసం నేడు సంకల్పించారు. మంత్రులు, జిల్లా పాలన, రక్షణ యంత్రాంగాన్ని ‘ఆంధ్రజ్యోతి’ నవ వసంతంలో అడుగులు వేసిన వేళ ఎలాంటి లక్ష్యాలు నిర్ధేశించుకున్నారని పలకరించింది.

పారిశ్రామిక ప్రగతే లక్ష్యం

ఈ ఏడాదిలో జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటు కోసం ఎంవోయూలు, మంత్రివర్గ ఆమోదం కూడా చేశాం. సీఎం చంద్రబాబు కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం వద్ద ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైనేషన (ఎఫ్‌టీఓ), ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌లో 300 ఎకరాల్లో నిర్మించే దేశంలోనే తొలి డ్రోన సిటీ, రూ.1,622 కోట్లతో బ్రహ్మణపల్లి వద్ద నిర్మించే రిలయన్స కిన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, రూ.285 కోట్ల సిగాచీ ఇండసీ్ట్రస్‌ సహా ఆరు కొత్త పరిశ్రమలు, మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. అవి కార్యరూపం దాల్చేలా 2026లో కృషి చేస్తాను.

ఫ టీజీ భరత, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూలు

సాంకేతికతతో నేరాలను కట్టడి చేస్తాం

రోడ్డుప్రమాదాలు ఎక్కువగా తెల్లవారుజామున జరుగుతున్నాయి. ఈఏడాది ‘ఫేస్‌ వాష్‌ అండ్‌ గో’ పక్కాగా చేపట్టడంతో చాలావరకు రోడ్డు ప్రమాదాలు నివారిం చగలిగాం. 2026లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని నేరాల కట్టడికి కృషి చేస్తాం. రోడ్డు సేఫ్టీ, టెక్నికల్‌ డ్రైవింగ్‌, యువత సెల్‌ఫోన్లలో అభ్యంతరకరమైన వెబ్‌సైట్లు వినియోగించకుండా అవగాహన కల్పించేందుకు పక్కా ప్రణాళిక నిర్దేశించుకుంటాం.

ఫ కోయ ప్రవీణ్‌, డీఐజీ, కర్నూలు రేంజ్‌

Updated Date - Dec 31 , 2025 | 10:51 PM