ఉపాధ్యాయులకు సర్వేపల్లి ఆదర్శం
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:21 AM
మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన ఉపాధ్యాయులకు ఆదర్శమని వక్తలు పేర్కొన్నా రు.
జమ్మలమడుగు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన ఉపాధ్యాయులకు ఆదర్శమని వక్తలు పేర్కొన్నా రు. శుక్రవారం జమ్మలమడుగులో సర్వేపల్లి జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవా న్ని రోటరీక్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు వెంకటక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు సమాజాని కి దిశానిర్ధేశకులన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్, న్యాయవాది ముళీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపారన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన వారిని ఎంపిక చేసి రోటరీ క్లబ్ సంస్థ తరుపున కార్యక్రమంలో రోటరీ జోనల్ సెక్రటరి భాస్కర్, ట్రెజరర్ ఓబుళరెడ్డి, ఉపాధ్యక్షుడు మహ్మద్‌రఫి, ఎస్టీయూ సెక్రటరి గురుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే..
ప్రొద్దుటూరు టౌన్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సంస్కృతి స్వచ్ఛంద సేవా సమితి కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సమాజంలో గౌరవ మర్యాదలు పొందేలా తీర్చిదిద్దేవారే ఉపాధ్యాయులన్నారు. రాయలసీమ వ్యాయామ శిక్షణ కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్ రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ గురువులకు తరగని సంపద శిష్యులేనన్నారు. డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు పునర్జన్మ ఇస్తారన్నారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్‌కొండయ్య, సాయికుమార్, గంగాధర్, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. స్థానిక రాణి తిరుమలదేవి డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరించుకుని డాక్టర్ రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించి ఉపాధ్యాయుల గౌరవాన్ని, స్థాయిని పెంచే విదంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు శ్రీనివాసరెడ్డి, నాగరాజు, సుబ్బారెడ్డి, సురేష్, వెంకటేశ్వర్లు, రామసుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవలు అందించిన ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులని, వారి సేవలు అమూల్యమైనవన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు ఓబుళరెడ్డి, ఛైర్మన్ కళావతి, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సర్వేపల్లి జయంతి
బద్వేలు, సెప్టెంబరు 5 (ఆంరఽధజ్యోతి): పట్టణంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన 137వ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాధాకృష్ణన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోస్ట్‌గార్డుగా పనిచేస్తూ పాకిస్తాన సైన్యం చేతిలో బందీలుగా ఉన్న 7 మంది భారత జాలర్లను చాకచక్యంగా విడిపించుకుని సీజీసీ అవార్డుకు ఎంపికైన కలసపాడు కొండపేటకు చెందిన పాల కొలను రమణారెడ్డిని బీసీ సంక్షేమ సంఘం, మాజీ సైనిక్ ఉద్యోగుల సంక్షేమ సంఘం తదితర కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.