Principal Secretary Chiranjeevi Chowdary: ఆహారశుద్ధి రంగంలో 12 వేల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:33 AM
ఐదేళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఈ 16 నెలల కాలంలోనే దాదాపు రూ.12 వేల కోట్ల మేర పెట్టుబడులు...
ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్లడి
అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఈ 16 నెలల కాలంలోనే దాదాపు రూ.12 వేల కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో శేఖర్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. గౌరవ చైర్మన్‌గా పొట్లూరి భాస్కరరావు, నూతన అధ్యక్షుడిగా వెలగపూడి సాంబశివరావు, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా వంశీ వెట్చా, కోశాధికారిగా చల్లా శేఖర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా పి.రామ్‌మోహన్, ఇతర కార్యవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టారు.