Share News

Food Distribution: అన్న క్యాంటీన్‌ నెట్‌వర్క్‌తో ఆహారం పంపిణీ

ABN , Publish Date - Oct 29 , 2025 | 04:02 AM

రాష్ట్రంలోని ‘అన్న క్యాంటీన్‌’ నెట్‌వర్క్‌ను వినియోగించుకుని తుఫాను ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు ఆహారం పంపిణీ చేసేందుకు హరే కృష్ణ...

Food Distribution: అన్న క్యాంటీన్‌ నెట్‌వర్క్‌తో ఆహారం పంపిణీ

మంగళగిరి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ‘అన్న క్యాంటీన్‌’ నెట్‌వర్క్‌ను వినియోగించుకుని తుఫాను ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు ఆహారం పంపిణీ చేసేందుకు హరే కృష్ణ మూవ్‌వెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ చర్యలు చేపట్టింది. ఈమేరకు ఫౌండేషన్‌ ఏపీ సెంట్రల్‌ రీజియన్‌ ఉపాధ్యక్షుడు విలాస దాస మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయపాత్ర కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పునరావాస కేంద్రాలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించే చర్యలు చేపట్టామన్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇతర వివరాలకు రఘనందన్‌ దాస, సెల్‌: 7386713300 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Updated Date - Oct 29 , 2025 | 04:03 AM