Kakinada District: హోం మంత్రిపై తప్పుడు పోస్టులు
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:30 AM
మాజీమంత్రి దాడిశెట్టి రాజా అనుచరుడు గణేశుల వీరబాబును పోలీసులు అరెస్టు చేశారు.
మాజీమంత్రి దాడిశెట్టి అనుచరుడి అరెస్టు
తుని రూరల్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి దాడిశెట్టి రాజా అనుచరుడు గణేశుల వీరబాబును పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాల విద్యార్థిని అత్యాచార ఘటనకు సంబంధించి హోంమంత్రి అనితపై అతడు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు షేర్ చేశాడు. దీనిపై తుని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం అతడిని పోలీసులు అరెస్టు చేశారు.