యోగాంధ్రపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - May 26 , 2025 | 11:33 PM
యోగాంధ్ర కార్యక్రమాలపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.
నంద్యాల నూనెపల్లె, మే 26 (ఆంధ్రజ్యోతి) : యోగాంధ్ర కార్యక్రమాలపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం పీజీఆర్‌ఎస్ హాల్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్వోరామునాయక్, డిప్యూటి కలెక్టర్లు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి యోగాపై అవగాహన కల్పించడంతో పాటు ప్రతిఒక్కరిని యోగాంధ్ర యాప్‌లో రిజిస్ట్రేషన ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల సిబ్బం ది, వారి కుటుంబసభ్యులు నమోదు కావాలన్నారు. జిల్లా స్థాయిలో 130మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చామని, వీరి ద్వారా ప్రతి మండలంలో 200మందికి శిక్షణ ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 5పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 31 శ్రీశైలంలో, జూన 7న మహానందిలో, జూన 16న జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయాల సిబ్బందితో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.
ఫ జాబ్‌మేళాతో ఉపాధి పొందాలి
నిరుద్యోగుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్‌మేళా ద్వారా ఉపాధి అవకాశాలను పొందాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జాబ్‌మేళా పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన 3జాబ్‌మేళాల ద్వారా ఎంతోమంది యువత ఉపాధి పొందారని, తద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. జూన 5న బనగానపల్లె నియోజకవర్గంలోని కేజీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తామని, 15ప్రైవేట్ కంపెనీల్లో జాబ్‌ల భర్తీ ఉంటుందన్నారు.