Share News

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:38 PM

శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ద్వారా 20,991 క్యూసెక్కులు,

   శ్రీశైలానికి  కొనసాగుతున్న వరద
శ్రీశైలం రిజర్వాయర్‌

శ్రీశైలం అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ద్వారా 20,991 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 17,518 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల నీరు విడుదల కాగా సాయంత్రానికి శ్రీశైల జలాశయానికి 74,693 క్యూసెక్కుల నీరు ఇనఫ్లోగా వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 26,617 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుదుత్పత్తి ద్వారా 35315, మొత్తంగా 61,532 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదలైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను 883.90 అడుగులు, పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.80 టీఎంసీలకుగాను 209.59 టీఎంసీలుగా నమోదైంది.

Updated Date - Oct 29 , 2025 | 11:38 PM