Flood Trouble: కొత్త జంటకు వరద కష్టాలు
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:38 AM
కొత్తగా పెళ్లయిన జంటను వరద కష్టాలు వెంటాడాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు కొత్త కాలనీకి చెందిన బొడ్డు అపర్ణాదేవికి..
కొత్తగా పెళ్లయిన జంటను వరద కష్టాలు వెంటాడాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు కొత్త కాలనీకి చెందిన బొడ్డు అపర్ణాదేవికి విశాఖవాసి పానగంటి పార్థసారథితో ఈ నెల 18 తెల్లవారుజామున వివాహమైంది. అత్తవారింటికి వచ్చేందుకు కొత్త జంట బుధవారం గొల్లప్రోలు చేరుకుంది. వరద నీరు అడ్డంకిగా మారింది. సుద్దగడ్డ కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జి పక్కనే ఉన్న ప్రత్యామ్నాయ రోడ్డుపైనా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె నిచ్చెన ఎక్కి వంతెన దాటి కాలనీకి చేరుకోవాల్సి వచ్చింది. - పిఠాపురం, ఆంధ్రజ్యోతి