Share News

తుంగభద్రకు వరద

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:41 PM

తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు 20 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు పెరిగిపోతుంది.

   తుంగభద్రకు వరద
18 టీఎంసీలకు చేరుకున్న తుంగభద్ర జలాశయం

ఇనఫ్లో 20053 క్యూసెక్కులు

ఔట్‌ ఫ్లో 236 క్యూసెక్కులు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు

జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

హాలహర్వి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు 20 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు పెరిగిపోతుంది. కర్నూలు జిల్లాకు 1.5లక్షల ఎకరాలకు సాగునీరు, 110గ్రామాలకు తాగునీరు అందించే ఈజలాశయానికి ఊహిం చని రీతిలో ప్రారంభ దశలోనే వరద పోటెత్తడంతో రైతన్నలు ఓ వైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆందోళన చెందుతున్నారు. గత యేడాది వరద ఉధృతికి 19వ గేటు కొట్టుకుపోవడంతో ఆయకట్టు రైతుల్లో అలజడి చెలరేగింది. జలాశయంకు సం బంధించిన 33 గేట్లు వెంటనే మార్పు చేయాలని, జలవనరుల కమిటీ నిపుణులు కన్హ య్యనాయుడు తేల్చి చెప్పారు. తుంగభద్ర బోర్డు అధికారుల నివేదిక ఆధారంగా రూ.180కోట్లకు టెండర్లను పిలిచారు. టెండర్లు దక్కించుకునే విషయంలో గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సంస్థలు పోటీపడ్డాయి. కానీ ప్రారంభ దశలోనే వరద పోటెత్తింది. దీంతో ఈయేడాది ఒక పంటకు సాగునీరు ఇస్తారా.. లేదంటే రెండు పం టలకు సాగునీరు ఇస్తారనేది బోర్డు అధికారులు తేల్చాల్సి ఉంది. ఒకవేళ లక్ష క్యూసెక్కులు వరద వస్తే పరిస్థితి ఏంటనేది అధికారులు సైతం కాస్త ఆందోళన ఉంది. ఈనేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల అధికారుల సమన్వయంతో ఉన్నతాధికారుల సమక్షంలో త్వరలోనే తుంగభద్ర జలాశయం నీటి విడుదలపై స్పష్టత రానుందని బోర్డు అధికా రులు చెబుతున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 18 టీఎంసీలకు చేరింది. వరద ఇనఫ్లో 20053 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. ఔట్‌ ఫ్లో 236 క్యూసెక్కులు కొనసాగుతోంది. త్వరలోనే తుంగభద్ర జలాశయం బోర్డు అధికా రులు సాగునీటిపై స్పష్టత ఇవ్వాలని జిల్లా ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:41 PM