Disaster Management Organization: వరదలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:33 AM
కృష్ణా, గోదావరి నదులకు వరదల నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. వరద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై...
విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు
అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదులకు వరదల నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. వరద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘వరద నీటిలో ప్రవేశించవద్దు. వరద నీటిలో నడవొద్దు. వరద ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండాలి. ఓపెన్ డ్రెయిన్లు, మ్యాన్‌హోల్స్ వద్ద ఎర్ర జెండాలు, బ్యారికేట్లు ఏర్పాటు చేయాలి. తాజాగా వండిన పొడి ఆహారాన్ని తినాలి. ఆహారాన్ని కవర్, ప్లేట్లతో మూసి ఉంచాలి. వేడి చేసిన, క్లోరినేషన్ చేసిన నీటినే తాగాలి. వరద ప్రాంతాలను ఖాళీ చేయాల్సి వస్తే.. మంచం, టేబుళ్లు, పర్నిచర్‌పై గృహోపకరణాలు ఉంచాలి. ఎత్తైన, సురక్షిత ఆశ్రయాలకు వెళ్లాలి. అత్యవసర వస్తు సామాగ్రి, ప్రథమ చికిత్స పెట్టె, విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలను సురక్షిత భవనాల్లోకి తీసుకెళ్లాలి. నీటి మడుగులు, గుంతలు, కాలువల్లోకి దిగకూడదు. అధికారులు చెప్పినప్పుడే తిరిగి సొంతిళ్లకు చేరుకోవాలి. విరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు తాకకూడదు. దోమ తెరలు వాడాలి. పాముల సంచారంతో జాగ్రత్తగా ఉండాలి. దెబ్బతిన్న వాటర్ పైపు, మురుగునీటి పైపుల నుంచి వచ్చే నీటిని వాడకూడదు’ అని పేర్కొంది.