Veterinary Council Chairman: పశు వైద్యుడు కావాలంటే ఐదేళ్ల డిగ్రీ చదవాల్సిందే
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:34 AM
ఆంధ్రప్రదేశ్‌లో పశు వైద్యుడు కావాలంటే పశు వైద్యశాస్త్రంలో ఐదేళ్ల డిగ్రీ ఉండాల్సిందేనని రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ పారా లక్ష్మయ్య స్పష్టం చేశారు.
రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ లక్ష్మయ్య
గుంటూరు సిటీ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పశు వైద్యుడు కావాలంటే పశు వైద్యశాస్త్రంలో ఐదేళ్ల డిగ్రీ ఉండాల్సిందేనని రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ పారా లక్ష్మయ్య స్పష్టం చేశారు. విజయవాడలోని ఏపీ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ కార్యాలయాన్ని శుక్రవారం గుంటూరు కొత్తపేటలోని పశుసంవర్థక శాఖ నూతన భవనంలోకి మార్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ప్యారా వెటర్నరీ కౌన్సిల్ చట్టంలో లోపాలు ఉన్నాయని, దానివల్ల విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు.