Share News

ఐదు..బడులు షురూ!

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:42 AM

ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయతలపెట్టిన ఐదురకాల బడులపై జిల్లాకు సంబంధించి స్పష్టత వచ్చినా క్షేత్రస్థాయిలో వీటిని ఏర్పాటు చేయడానికి కొన్నిచోట్ల ఎదురవుతోన్న ఆటంకాలను పరిష్క రించే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్ప గించారు.

ఐదు..బడులు షురూ!

ఎమ్మెల్యేల వద్దకు ఎంఈవోలు, ప్రత్యేకాధికారులు

ప్రస్తుత పాఠశాలల్లో ఒక్కటీ మూతపడకుండా చర్యలు

మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటులో ‘పశ్చిమ’ ముందంజ

ఏలూరు అర్బన్‌, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయతలపెట్టిన ఐదురకాల బడులపై జిల్లాకు సంబంధించి స్పష్టత వచ్చినా క్షేత్రస్థాయిలో వీటిని ఏర్పాటు చేయడానికి కొన్నిచోట్ల ఎదురవుతోన్న ఆటంకాలను పరిష్క రించే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్ప గించారు. ప్రస్తుతమున్న పాఠశాలల్లో ఏ ఒక్క టీ మూసివేయాల్సిన పరిస్థితులు లేకుండా అన్నింటినీ కొనసాగిస్తూనే ఐదురకాల బడులు గా పునర్వ్యవస్థీకరించడానికి చేపట్టిన కసరత్తు లో భాగంగా ఆయా పాఠశాలల ఎస్‌ఎంసీ (స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ)ల నుంచి అను మతి/ అంగీకారంతో తీర్మానాలు తీసుకోవాల్సిన దశలో పలు ఎస్‌ఎంసీలు అభ్యంతరాలను తెల పడం గమనార్హం. వారిని ఒప్పించడంలో మం డల స్థాయిలోనే విద్యాశాఖాధికారులు పలువు రు విఫలమైనట్టు సమాచారం అందడంతో ఎస్‌ఎంసీలను ఒప్పించి, ఐదురకాల బడులపై ప్రతిపాదనలకు తీర్మానాలను చేయించే బాధ్య తలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల వద్దకు ఆయా పంచాయతీల వారీగా ఐదురకాల బడులపై ప్రతిపాదనలను ఎంఈవో లు, ప్రత్యేకాధికారులు తీసుకెళుతున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ప్రాథమిక పాఠ శాలల్లోని 3,4,5 తరగతులను దూరాభారంలోని ఉన్నత పాఠశాలలకు తరలించడం వల్ల ఏలూరు జిల్లాలో సుమారు 249 పాఠశాలల బాలబాలికలు సమీప హైస్కూళ్లకు వెళ్లాల్సి వచ్చేది. తాజాగా ఏర్పాటుచేయ ప్రతిపాదించిన ఐదురకాల బడు ల్లో ఇంతకుముందు హైస్కూళ్లకు తరలించిన ప్రాథమిక తరగతుల న్నింటినీ ఆయా ప్రాథమిక పాఠ శాలలకే వెనక్కి పంపడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళుతున్నారు. ఇక ప్రతీ తరగతికి ఓ టీచరు, అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయతలపెట్టిన 298 మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల విషయంలో స్థానికుల నుంచి సాను కూలత వ్యక్తమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏలూరు అర్బన్‌, రూరల్‌ మండలాల్లో ప్రతిపాదించిన 26 ఫౌండేషనల్‌ స్కూళ్ల విషయంలో 25 స్కూళ్ల ఎస్‌ఎంసీలు తమ వ్యతిరేకతను తెలిపినట్టు సమాచారం. ఇక్కడ ఒకేఒక్క ఫౌండేషనల్‌ స్కూలు ఏర్పాటు కు ఎస్‌ఎంసీ నుంచి సానుకూలత వచ్చింది.

ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదనలు..

ఏలూరు జిల్లాలోని 27 మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన 111 క్లస్టర్ల పరిధిలోని 617 పంచాయతీల్లో ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటి, రెండో తరగతిలతో కూడిన ఫౌండేషనల్‌ స్కూళ్లు 218, ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు ఉండే మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు 298, సహజ సిద్ధమైన అడ్డంకుల కారణంగా పునర్వ్యవస్థీక రణకు అవకాశం లేనందున ఎల్‌కేజీ, యూకేజీ లతో పాటు, ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు బోధించే బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లు 843 ఏర్పాటయ్యేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవిగాక ప్రాథమికోన్నత పాఠశాలలు 49, ఆరో తరగతి నుంచి పదోతరగతి వరకు లేదా ఆరో తరగతి నుంచి ఇంటర్‌వరకు బోధించే హైస్కూళ్లు 204 కలిపి జిల్లాలో మొత్తం 1,612 ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల్లో పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏ ఒక్కటీ మూసి వేయాల్సిన పరిస్థితులు తలెత్తకుండా ఐదు బడుల ఏర్పాటులో జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంమీద ఉమ్మడి జిల్లాకు సంబందించి ఐదురకాల బడుల ఏర్పాటుపై ఆదివారం నాటి కి ప్రగతి ఎలా ఉందంటే.. ఏలూరు జిల్లాలో మూడు డివిజన్లకు గాను 27 మండలాల్లో 111 క్లస్టర్లలో 617 పంచాయతీలుండగా మొత్తం 1,612 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,119 పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు కసరత్తు పూర్తికాగా, 975 పాఠశాలల ఎస్‌ఎంసీలు సాను కూలతను తెలిపాయి. మరో 490 పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయడా నికి ప్రతిపాదించిన మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో 154 పాఠశాలలను ప్రారంభించడానికి ఇప్పటి వరకు ఆమోదం లభించింది.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు డివి జన్లకు గాను 20 మండలాలను 89 క్లస్టర్లుగా ఏర్పాటు చేయగా, వీటిలో మొత్తం 513 పంచా యతీల పరిధిలో 1396 పాఠశాలలున్నాయి. వీటిలో 1,381 పాఠశాలల పునర్వ్య వస్థీకరణకు చర్యలు చేపట్టగా 1,370 పూర్తయ్యాయి. మరో 11 పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 1000 పాఠశాలల నుంచి ఐదురకాల బడులకు అంగీకారం లభించింది. అత్యధికంగా 262 మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుకు సాను కూలత రావడం ఉమ్మడి జిల్లాలో ‘పశ్చిమ’ ప్రత్యేకతగా చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల విషయంలో ఏలూరు జిల్లా కంటే పశ్చిమ గోదావరి జిల్లా ఒక అడుగు ముందంజలోనే ఉండడం గమనార్హం.

Updated Date - Mar 11 , 2025 | 12:42 AM