Share News

First National Flag Flown: ఎర్ర కోటపై ఎగిరిన తొలి జెండా వీళ్లదే

ABN , Publish Date - Aug 15 , 2025 | 05:58 AM

జాతీయ జెండాను రూపొందించింది పింగళి వెంకయ్య. మరి ఎర్రకోటపై ఎగిరిన తొలి జాతీయ పతాకం సిద్ధం చేసింది..

First National Flag Flown: ఎర్ర కోటపై ఎగిరిన తొలి జెండా వీళ్లదే

  • ఆ జాతీయ పతాకం తయారైంది గుడియాత్తంలోనే

  • తయారు చేసింది చేనేతలో చేయి తిరిగిన వెంకటాచలం

వేలూరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): జాతీయ జెండాను రూపొందించింది పింగళి వెంకయ్య. మరి ఎర్రకోటపై ఎగిరిన తొలి జాతీయ పతాకం సిద్ధం చేసింది చేనేత వృత్తిలో చేయి తిరిగిన వెంకటాచలం, మునిరత్నమ్మాళ్‌ దంపతులు. చేనేతకు ప్రసిద్ధి చెందిన వేలూరు జిల్లా గుడియాత్తంలో దీనిని తయారు చేశారు. గుడియాత్తం మున్సిపాలిటీ అధ్యక్షుడిగా 1932 నుంచి 10 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించిన వెంకటాచలం చేనేత మెళకువల గురించి తెలుసుకున్న అధికారులు... పింగళి వెంకయ్య రూపొందించిన మేరకు జాతీయ పతాకాన్ని తయారు చేయాలని కోరారు. 12 అడుగుల వెడల్పు, 18 అడుగుల పొడవుతో మూడు జాతీయ పతాకాలను భార్య మునిరత్నమ్మాళ్‌తో కలసి వెంకటాచలం తయారుచేశారు. వీటిలో ఒకటి 1947 ఆగస్టు 15వ తేది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్ర కోటపై ఎగురవేశారు. మరొకటి చెన్నై జార్జ్‌కోటపై ఎగురవేశారు. ప్రస్తుతం ఆ పతాకం జార్జి కోట ప్రాంగణంలోని పురావస్తు పరిశోధనశాఖ మ్యూజియంలో అద్దాల పెట్టెలో భద్రంగా వుంది. ఆ రోజున దేశవ్యాప్తంగా 10 లక్షల జెండాల తయారీ కోసం గుడియాత్తం నగరానికి ఆర్డర్లు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. వెంకటాచలంను మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ అభినందించారు. నాటి ప్రధాని నెహ్రూ వ్యక్తిగత కార్యదర్శి వెంకటాచలంకు కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన లేఖ ఇప్పటికీ వెంకటాచలం కుటుంబీకుల వద్ద వుంది.

Updated Date - Aug 15 , 2025 | 05:58 AM