Share News

AP Govt: అమరావతిలో తొలి హెచ్‌వోడీ

ABN , Publish Date - Oct 13 , 2025 | 04:27 AM

రాష్ట్ర రాజధాని అమరావతిలో సచివాలయ భవనాల నిర్మాణం తర్వాత మొట్ట మొదటిగా మున్సిపల్‌శాఖ నిర్మించిన(హెచ్‌వోడీ) భవనం సిద్ధమైంది.

AP Govt: అమరావతిలో తొలి హెచ్‌వోడీ

  • నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.. ‘ఏ’ అక్షరంతో భవనానికి ఎలివేషన్‌

  • 4.32 ఎకరాల్లో 7 అంతస్థుల్లో నిర్మాణం.. మునిసిపల్‌ శాఖ పనులన్నీ ఇక ఇక్కడి నుంచే

  • కొలువుదీరనున్న మునిసిపల్‌ మంత్రి, డైరెక్టర్‌, సీఆర్‌డీఏ, ఏడీసీ కార్యాలయాలు

  • రాజధాని రైతులకు చేరువలో అధికారులు

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతిలో సచివాలయ భవనాల నిర్మాణం తర్వాత మొట్ట మొదటిగా మున్సిపల్‌శాఖ నిర్మించిన(హెచ్‌వోడీ) భవనం సిద్ధమైంది. ఆ శాఖ పాలనా వ్యవహారాలు, కార్యకలాపాలు ఇకపై ఇక్కడ నుంచే నిర్వహించనున్నారు. ఈ పాలనా భవనాన్ని సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. రాజధానిలో పాలనా సౌలభ్యం కోసం మునిసిపల్‌ శాఖలోని అన్ని విభాగాలు ఒకే చోట అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో ఈ భవనాన్ని నిర్మించారు. రాజధాని అమరావతి పేరును ప్రతిబింబించేలా భవనం ముందు ఆంగ్ల అక్షరం ‘ఏ’తో ఎలివేషన్‌ను తీర్చిదిద్దారు. ఇకపై అమరావతి నిర్మాణ పనులన్నీ ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. అమరావతిలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఈ-3-ఎన్‌11 కూడలి వద్ద రాయపూడి సమీపంలో మున్సిపల్‌శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. మొత్తం 4.36 ఎకరాల్లో ఏడు అంతస్థుల్లో దీన్ని పూర్తిచేశారు. హెచ్‌వోడీలో మునిసిపల్‌ శాఖ మంత్రి చాంబర్‌ సహా సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్‌(ఏడీసీ) అధికారుల చాంబర్లు ఉన్నాయి. ఇక ప్రధాన కార్యాలయానికి పక్కనే 8 ఎకరాల్లో పార్కింగ్‌ ఏరియాతో కలిపి పీఈబీ(ప్రీ-ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌) విధానంలో మరో 4 భవనాలు నిర్మించారు.

ఏడు అంతస్థుల్లో.. ఏమేమి?

గ్రౌండ్‌ ఫ్లోర్‌: రిసెప్షన్‌, పబ్లిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌, రెస్టారెంట్‌, బ్యాంక్‌, ఏఐ కమాండ్‌ సెంటర్‌.

ఫస్ట్‌ ఫ్లోర్‌: సదస్సులు, సమావేశాలకు వివిధ హాళ్ల నిర్మాణం.

2, 3, 5 ఫ్లోర్లు: సీఆర్‌డీఏ కార్యాలయాలు.

నాలుగో ఫ్లోర్‌: మున్సిపల్‌శాఖ డైరక్టర్‌ ఆఫీస్‌.

ఆరో ఫ్లోర్‌: అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఏడీసీ) ఆఫీస్‌.

ఏడో ఫ్లోర్‌: మున్సిపల్‌శాఖ మంత్రి, ముఖ్యకార్యదర్శి చాంబర్లు. పబ్లిక్‌హెల్త్‌ ఈఎన్‌సీ, ఏడీసీఎల్‌ ఆఫీసు.

టెర్రస్‌ పీఈబీ: డైనింగ్‌ హాల్‌.


హెచ్‌వోడీ సమగ్ర స్వరూపం!

  • మొత్తం విస్తీర్ణం 4.32 ఎకరాలు.

  • నిర్మాణం 3,07,326 చదరపు అడుగులు.

  • జీ+7 అంతస్థులుగా నిర్మాణాలు.

  • గ్రీన్‌ జోన్‌ 0.88 ఎకరాలు.

  • పార్కింగ్‌ ప్రాంతం 1.36 ఎకరాలు.

  • ఓపెన్‌ స్పేస్‌ 0.96 ఎకరాలు.

  • ఎస్టీపీ 0.39 ఎకరాలు.

  • 8 మంది సామర్థ్యంతో 7 లిఫ్టులు.

  • ఫోర్‌ వీలర్స్‌, 170 టూవీలర్స్‌కు పార్కింగ్‌.


నాలుగు ఇతర భవనాలు

భవనం-1: మెప్మా కార్యాలయం.

భవనం-2: టిడ్కో, ఏపీయూఎ్‌ఫఐడీసీ.

భవనం-3: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌, రెరా అప్పిలేట్‌ అథారిటీ, గ్రీనింగ్‌ కార్పొరేషన్‌.

భవనం-4: రెరా, టౌన్‌ప్లానింగ్‌ఆఫీసులు.

ఒక్కొక్క భవనం విస్తీర్ణం 41,500 చదరపు అడుగులు.

ఈ 4 భవనాలకు సంబంధించి ప్రత్యేక పార్కింగ్‌ సౌకర్యం.

Updated Date - Oct 13 , 2025 | 04:27 AM