Firecracker Explosion: కిరాణా దుకాణంలో బాణసంచా పేలుడు
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:42 AM
కిరాణా షాపులో బాణసంచా సామాగ్రి పేలి భార్యాభర్తలు మృతిచెందారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలసకు చెందిన...
భార్యాభర్తలు మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు
అయినవిల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కిరాణా షాపులో బాణసంచా సామాగ్రి పేలి భార్యాభర్తలు మృతిచెందారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలసకు చెందిన కంచర్ల శ్రీనివాస్(50), భార్య సీతామహలక్ష్మి(48) భార్యభర్తలు. వీరు స్థానికంగా కిరాణాషాపు నిర్వహిస్తున్నారు. పదేళ్లుగా వీరు తాత్కాలిక లైసెన్సు తీసుకుని దీపావళికి బాణాసంచా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో భార్యభర్తలు వంట గదిలోని అటక మీద గతేడాది మిగిలిన మందుగుండు సామాగ్రిని దింపుతున్నారు. ఈ సమయంలో పేలుడు సంభవించి భారీ శబ్ధంతో ఇల్లు కూలిపోయింది. దీంతో ఇద్దరి మృతదేహాలూ శిథిలాల కిందే ఉండిపోయాయి. వారి కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.