Share News

AP Government: ఇకపై ఐదేళ్లకోసారి ఎన్‌వోసీ..

ABN , Publish Date - Dec 18 , 2025 | 04:54 AM

అగ్నిమాపక అనుమతుల విషయంలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది.

AP Government: ఇకపై ఐదేళ్లకోసారి ఎన్‌వోసీ..

  • జూనియర్‌ కాలేజీలకు అనుమతుల్లో ఉపశమనం

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక అనుమతుల విషయంలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ప్రతి సంవత్సరం ఎన్‌వోసీ తీసుకునే నిబంధన స్థానంలో ఐదేళ్లకోసారి తీసుకునేలా నిబంధనలు మార్చింది. అధికారంలోకి వచ్చాక ఈ నిబంధనను మార్చి ఐదేళ్లకోసారి ఎన్‌వోసీ ఇచ్చేలా మార్పులు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాలేజీ యాజమాన్యాలకు లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా ఇప్పుడు నిబంధనలు మార్చారు. కాగా.. గత వైసీపీ ప్రభుత్వం కాలేజీలను వేధించడమే లక్ష్యంగా ప్రతిఏటా ఫైర్‌ ఎన్‌వోసీ తీసుకోవాలనే నిబంధన తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు.

Updated Date - Dec 18 , 2025 | 04:55 AM