Kurnool: ఆర్టీసీ బస్సులో మంటలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 06:34 AM
ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆదోని డిపోకు చెందిన...
ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆదోని డిపోకు చెందిన సింగిల్ స్టాప్ బస్సు మంగళవారం ఉదయం కర్నూలు బయల్దేరింది. గోనెగండ్ల ఎస్సీ కాలనీకి చేరుకున్న సమయంలో డ్రైవర్ దగ్గర బ్యానెట్ నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ తిప్పన్న బస్సును నిలిపివేసి, ప్రయాణికులను దించేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.
- (గోనెగండ్ల, ఆంధ్రజ్యోతి)