Share News

Disaster Management Dept: సెప్టెంబరులోపు ఫైరింజన్లు కొంటాం

ABN , Publish Date - Jul 09 , 2025 | 06:47 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులతో ఫైరింజన్ల కొనుగోలు ప్రక్రియ సెప్టెంబరులోపు పూర్తి చేస్తామని రాష్ట్ర అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్‌ మురళి తెలిపారు.

Disaster Management Dept: సెప్టెంబరులోపు ఫైరింజన్లు కొంటాం

  • నిధుల వినియోగంలో జాప్యానికి మూడు కారణాలు

  • అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ వివరణ

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులతో ఫైరింజన్ల కొనుగోలు ప్రక్రియ సెప్టెంబరులోపు పూర్తి చేస్తామని రాష్ట్ర అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్‌ మురళి తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలు, రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదలలో ఆలస్యం, ఈ బాధ్యతలు చూసే డైరెక్టర్‌ స్వచ్ఛందంగా తప్పుకోవడం జాప్యానికి కారణాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఫైరింజన్ల కొనుగోలు, ఫైర్‌ స్టేషన్ల నిర్మాణంలో జాప్యంపై ‘ఫైర్‌కు పైత్యం’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. గతేడాది జూలైలో రాష్ట్రానికి రూ.252.93కోట్లను కేంద్రం కేటాయించిందని, అందులో మొదటి విడతగా రూ.63.23కోట్ల బడ్జెట్‌ విడుదలైనా రాష్ట్ర ప్రభుత్వ వాటా 2025 జనవరిలో వచ్చిందన్నారు. కొనుగోలు ప్రక్రియకు సిద్ధం చేసేలోపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వచ్చిందని, అప్పటి వరకూ ఈ బాధ్యతలు చూసిన డైరెక్టర్‌ తాను తప్పుకుంటానని డీజీకి చెప్పడంతో మరో డైరెక్టర్‌ ద్వారా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయించి 111ఫైరింజన్ల ఛాసి్‌సలు కొనుగోలు చేశారని చెప్పారు. అవి ఏప్రిల్‌లో వచ్చాయని, రాష్ట్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తే బాడీ నిర్మించి సెప్టెంబరులోపే అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. మరో రూ.12.93కోట్లతో ఫైర్‌ స్టేష న్ల నిర్మాణం, అసంపూర్తిగా ఉన్నవి పూర్తి చేసేందుకు ఏపీ పోలీస్‌ హౌసింగ్‌కు నిధులు మళ్లించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్ర ఆర్థిక శాఖ నిధుల విడుదలలో జాప్యం చేయడానికి డీపీఆర్‌లో మార్పులు చేయడమే కారణమని తెలిసింది.

Updated Date - Jul 09 , 2025 | 06:50 AM