ఆడబిడ్డల ఆర్థిక ప్రగతే టీడీపీ విధానం: సుజాత
ABN , Publish Date - Aug 17 , 2025 | 06:14 AM
ఆడబిడ్డలు, అక్కాచెల్లెమ్మల ఆర్థిక స్థితిని వృద్ధిలోకి తీసుకురావాలన్నదే టీడీపీ విధానం అని మాజీ మంత్రి, ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ చైర్‌పర్సన్ పీతల సుజాత అన్నారు.
అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ‘ఆడబిడ్డలు, అక్కాచెల్లెమ్మల ఆర్థిక స్థితిని వృద్ధిలోకి తీసుకురావాలన్నదే టీడీపీ విధానం’ అని మాజీ మంత్రి, ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ చైర్‌పర్సన్ పీతల సుజాత అన్నారు.టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో డ్వాక్రా ద్వారా కోటి మంది మహిళలు, వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచిన చంద్రబాబు...ఇప్పుడు స్త్రీలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు స్త్రీశక్తి పథకం పేరుతో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. ఇలాంటి మంచి పథకాన్ని కూడా వైసీపీ వ్యతిరేకిస్తోంది.జగన్ సతీమణి భారతి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసి, ఈ పథకం ప్రయోజనం ఏమిటో తెలుసుకోవచ్చు’ అని సుజాత అన్నారు.