Share News

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:54 PM

స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రులు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు.

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
కొక్కెరంచలోని బాధితకుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తున్న పూర్వ విద్యార్థులు

కొత్తపల్లి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రులు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. 1990-91లో ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొక్కెరంచ గ్రామానికి చెందిన వెంకటయ్య పదవ తరగతి చదివాడు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పూర్వ స్నేహితులు ఆదివారం గ్రామానికి వెళ్లి బాధితకుటుంబాన్ని పరామర్శించారు. రూ. రూ.1.10,000 ఆర్థికసాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు స్నేహితులు ఉన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 11:54 PM