Finance Department: బనకచర్లకు పరిపాలనా ఆమోదంపై ఆర్థిక శాఖ ప్రశ్నలు
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:40 AM
గోదావరి-బనకచర్ల’కు నిధులపై రాష్ట్ర ఆర్థిక శాఖ పలు సందేహాలు లేవనెత్తింది. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు కోరుతూ ఆర్థిక శాఖకు జలవనరుల శాఖ ఫైలు పంపింది.
అది వచ్చాకే డీపీఆర్ తయారీ ప్రక్రియ
అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): ‘గోదావరి-బనకచర్ల’కు నిధులపై రాష్ట్ర ఆర్థిక శాఖ పలు సందేహాలు లేవనెత్తింది. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు కోరుతూ ఆర్థిక శాఖకు జలవనరుల శాఖ ఫైలు పంపింది. దీనిని పరిశీలించిన ఆర్థిక శాఖ నిధులు సమకూర్చుకోవడంపై సందేహాలు లేవనెత్తింది. ఇది సాధార ణంగా జరిగే ప్రక్రియేనని, బనకచర్ల విషయంలోనూ అదే జరిగిందని అధి కార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి ఇచ్చిన వెంటనే నిధులు మంజూరు చేయాల్సిన అవసరం లేదు. కానీ.. సమగ్ర ప్రా జెక్టు నివేదిక(డీపీఆర్)ను తయారు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. బనకచర్ల ప్రాజెక్టుపై ఆర్థిక శాఖకు పూర్తి అవగాహన ఉంది. ఈ ప్రాజెక్టు ప్రీఫీజుబిలిటీ రిపోర్టును ఆ శాఖ అధికారులే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు గతంలో అందజేశారు. ఈ పథకం పూర్తి చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. రూ.81,900 కోట్లతో చేపట్టే ఈ పథకానికి సహకరించాలని.. 50 శాతం నిధులైనా భరించాలని, ఆర్థిక సంస్థ ల నుంచి రుణాలు పొందేందుకు వెసులుబాటు కల్పించాలని కూడా కోరా రు. ఆర్థిక శాఖ అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ నుంచి సమాధానాలు వెళ్లగానే.. పాలనా అనుమతులు లభించే అవకాశమున్నట్లు చెబుతున్నారు.