Share News

ఎట్టకేలకు గిరిజన సంక్షేమ శాఖ డీడీ పోస్టు భర్తీ

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:37 PM

ఎట్టకేలకు పది నెలల తరువాత స్థానిక గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టు భర్తీ అయింది. నెల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిగా పని చేస్తున్న పీబీకే పరిమిళకు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి స్థానిక ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమిస్తూ ఆ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ సోమవారం(జీవో ఎంఎస్‌. నంబర్‌: 20) జారీ చేశారు.

ఎట్టకేలకు గిరిజన సంక్షేమ శాఖ డీడీ పోస్టు భర్తీ
పీబీకే పరిమిళ

నెల్లూరు టీడబ్ల్యూవోకు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ నియామకం

పాడేరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు పది నెలల తరువాత స్థానిక గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టు భర్తీ అయింది. నెల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిగా పని చేస్తున్న పీబీకే పరిమిళకు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి స్థానిక ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమిస్తూ ఆ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ సోమవారం(జీవో ఎంఎస్‌. నంబర్‌: 20) జారీ చేశారు. ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖ డీడీగా పని చేసిన ఐ.కొండలరావును గతేడాది అక్టోబరులో గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. దీంతో అప్పటి నుంచి స్థానిక ఏటీడబ్ల్యూవోగా పని చేసిన ఎల్‌.రజనికి డీడీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇటీవల జరిగిన బదిలీల్లో ఏటీడబ్ల్యూవో రజనికి పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మిపురం బదిలీ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ఈ క్రమంలో ఈ నెల 5న కొయ్యూరులో ఏటీడబ్ల్యూవోగా పని చేస్తున్న పి.కాంత్రికుమార్‌కు స్థానిక గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయనే ప్రస్తుతానికి టీడబ్ల్యూ డీడీగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నెల్లూరులోని జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారిగా పని చేస్తున్న పీబీకే పరిమిళకు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ స్థానిక టీడబ్ల్యూ డీడీగా నియమించారు. వాస్తవానికి పాడేరులోని ఐటీడీఏ పీవో తరువాత అంతటి బాధ్యతలుండే గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టును పది నెలలుగా భర్తీ చేయకపోవడంపై ప్రజాప్రతినిధులు, ప్రజా, విద్యార్థి సంఘాలు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు టీడబ్ల్యూ డీడీ పోస్టు భర్తీ కావడం విశేషం.

Updated Date - Aug 18 , 2025 | 11:37 PM