Share News

Higher Education Council: ఎట్టకేలకు డిగ్రీ సీట్ల కేటాయింపు

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:16 AM

ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు సీట్లు కేటాయించింది. మొత్తం 1,30,273 మందికి సీట్లు కేటాయించినట్లు బుధవారం రాత్రి తెలిపింది.

 Higher Education Council: ఎట్టకేలకు డిగ్రీ సీట్ల కేటాయింపు

  • 1,30,273 సీట్లు భర్తీ, మిగులు సీట్లు 2,51,765

అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు సీట్లు కేటాయించింది. మొత్తం 1,30,273 మందికి సీట్లు కేటాయించినట్లు బుధవారం రాత్రి తెలిపింది. మొత్తం 1200 కాలేజీల్లో 3,82,038 సీట్లు అందుబాటులో ఉండగా 2,51,765 సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ కాలేజీల్లో 70,005 సీట్లకు గాను 27,348 సీట్లు భర్తీ అయ్యాయి. ఎయిడెడ్‌ కాలేజీల్లో 24,699 సీట్లు ఉంటే 6,931, ప్రైవేటు కాలేజీల్లో 28,1940 సీట్లు ఉంటే 94,051, ప్రైవేటు యూనివర్సిటీల్లో 1,461 సీట్లకు 428, యూనివర్సిటీ కాలేజీల్లో 3,933 సీట్లుంటే 1,551 భర్తీ అయ్యాయి. మొత్తం డిగ్రీ కౌన్సెలింగ్‌కు 1,67,161 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా, 1,54,058 మంది దరఖాస్తులు సమర్పించారు. 1,50,410 మంది వెబ్‌ ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈనెల 18 నుంచి 22 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. కొందరు విద్యార్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లు సరిపోలకపోవడంతో వారికి సీట్లు కేటాయించలేదు.

Updated Date - Sep 18 , 2025 | 05:16 AM