Share News

అడవులను తలపిస్తున్న పొలాలు

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:02 AM

మండ లంలో సారవంతమైన మాగాణి భూములు చిట్ట డవులను తలపిస్తున్నాయి.

అడవులను తలపిస్తున్న పొలాలు
ఓబుళాపురం చెరువుకింద చిట్టడవిగా మారిన మాగాణి భూములు

గిట్టుబాటు కాక సాగుకు నోచుకోని

మాగాణి భూములు

వేల ఎకరాల నుంచి వందల్లోకి

డిపోయిన సాగు విస్తీర్ణం

వరిపై ఆసక్తి చూపని రైతన్నలు

కాశినాయన ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మండ లంలో సారవంతమైన మాగాణి భూములు చిట్ట డవులను తలపిస్తున్నాయి. సంవత్సరాల తరబడి వందల ఎకరాల మాగాణి భూములు సాగుకు నోచుకోక ముళ్ళకంప పిచ్చిమొక్కలతో చిట్టడవు లుగా మారుతున్నాన్నాయి. గతంలో చెరువులు కుంటల కింద ఉండే మాగాణి భూములతో పా టు వరికుంట్ల, నాయనపల్లె, ఇటుకులపాడు తది తర గ్రామాల్లో బోరుబావుల కింద కూడా ఖరీఫ్‌, రబీలో వరి విస్తారంగా సాగుచేసేవారు. ప్రస్తు తం ఆ పరిస్థితి కనిపించడంలేదు. దీనంతటికి కారణం వరి గిట్టుబాటు కాక పోవడమేనని రైత న్నలు పేర్కొంటున్నారు గత దశాబ్దకాలంగా మం డలంలో వరి సాగు విస్తీర్ణం పరిశీలిస్తీ 2013, 2014, 2015 సంవత్సరాలల్లో దాదాపు 4500 ఎక రాల నుంచి 5000 ఎకరాల వరకు సరాసరి సాగ య్యేది. అలాంటిది 2023 సంవత్సరం నాటికి వరి సాగు 1926 ఎకరాలకు పడిపోయింది. 2024 సంవత్పరంలో 1567 ఎకరాలుకు చేరింది. ప్రస్తు తం ఇప్పటివరకు కేవలం 170 ఎకరాలే వరిసాగు చేశారంటే పరిస్థితి ఎంతటి ఇబ్బందికరంగా మా రిందో ఇట్టే అర్థమవుతుంది. వరి సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఎకరాకు వరి నాటడానికి కూలీ ఖర్చు రూ.6వేలు, సేద్యా నికి, ఎరువులకు, పిచికారి మందులకు, కోతమిష నకు ఇలా అన్ని ఖర్చులు పరిగణలోకి తీసుకొంటే ఎంతలేదన్నా ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చులు వస్తున్నాయి.

పంట దిగుబ డి బాగా పండింది అనుకుంటే ఎకరాకు సరాసరి 20 నుంచి 25 బస్తాలకంటే ఎక్కువ రావడం లేదంటున్నారు. ధరలు కూడా అంతంతమటుకే ఉన్నాయి. ఆరుగాలం కష్టించి సన్నాలు రకం పంట పండించినా ఆసమయంలో కల్లాల్లోనే బస్తా రూ.1300 నుంచి రూ.1400 మించి కొను గోలు చేయలేమంటారు.. ఆలెక్కన పంట పండిం చిన రైతులకు దినసరికూలీ కూడా లభించని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి పంట చేతికొ చ్చే సమయంలో అకాలవర్షాలు చుట్టుముడితే పెట్టుబడి కూడా చేతికందదంటున్నారు రైతన్న లు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బోరుబావుల కింద వరి సాగు చేసే రైతులు వరికి బై చెప్పి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు చెరువుల కింద వరి తప్ప ఏమీపండని మాగాణి భూములను సాగుచేసి నష్టపోవడం దేనికేటూ వదిలేస్తున్నా రు. ఓబుళాపురం పెద్దచె రువుకింద దాదాపు 150 నుంచి 200 ఎకరాలు మాగాణి గత 5 సం వత్సరాలుగా సాగుకు నోచు కోక వందల ఎకరాల మాగాణి పొలం తుమ్మకం ప పిచ్చిమొక్కలతో చిట్టడవుల్లాగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని వరి సాగును ప్రోత్స హిం చేలా చర్యలు తీసుకోవాలని ధాన్యానికి గిట్టు బాటు ధర వచ్చేలా చూడాలని పలువురు రైతు లు కోరుతున్నారు.

Updated Date - Aug 25 , 2025 | 12:02 AM