Share News

AP Government: విద్యార్థులకు ఫీజుల ఉపశమనం

ABN , Publish Date - Sep 28 , 2025 | 03:48 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విషయంలో విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది.

AP Government: విద్యార్థులకు ఫీజుల ఉపశమనం

  • 400 కోట్లు విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు

  • 2023-24, 2024-25ఫైనలియర్‌ విద్యార్థులకు త్వరలో చెల్లింపు

అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విషయంలో విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో ఉన్నత విద్య కోర్సుల ఫైనలియర్‌ పూర్తిచేసి బయటికొచ్చిన విద్యార్థుల ఫీజు బకాయిల కోసం రూ.400 కోట్లు విడుదల చేస్తూ శనివారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. 2024-25 విద్యా సంవత్సరం ఫీజులను కాలేజీల ఖాతాల్లో జమ చేస్తారు. 2023-24 విద్యా సంవత్సరం వరకు ఉన్న నిబంధనల ప్రకారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజులు జమచేయాలి. అయితే ఫీజులు కట్టకపోయినా తాము సర్టిఫికెట్లు ఇచ్చామని, అందువల్ల ఆ ఫీజులు తమకే ఇవ్వాలని కొన్ని కాలేజీలు అడుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం సర్వే చేయించగా.. చాలావరకు కాలేజీలు ఇప్పటికే ఫీజులు వసూలు చేసినట్లు తేలింది. దీంతో ఆ విద్యా సంవత్సరం ఫీజులను తల్లుల ఖాతాల్లోనే జమచేసే అవకాశం ఉంది.

Updated Date - Sep 28 , 2025 | 03:49 AM