Prakasam District: కనురెప్పే కాటేసింది
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:25 AM
కుమార్తెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కాటేశాడు. మైనర్ అయిన ఆ బాలికపై వారం రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కుమార్తెపై తండ్రి పలుమార్లు లైంగిక దాడి
ప్రకాశం జిల్లా కొండపిలో అమానుష ఘటన
తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు
కొండపి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కుమార్తెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే కాటేశాడు. మైనర్ అయిన ఆ బాలికపై వారం రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన ప్రకాశం జిల్లా కొండపి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడు తన 12 ఏళ్ల కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న కుమార్తెను తల్లి శనివారం ఒంగోలు రిమ్స్‌కు తీసుకెళ్లింది. అక్కడ పరీక్షించిన వైద్యులు.. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. తల్లి గట్టిగా ప్రశ్నించడంతో తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి ఆదివారం కొండపి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను తల్లి ఒంగోలు తీసుకెళ్లిన తర్వాత తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడని సమాచారం.