Share News

ఉల్లిని వదిలేసిన రైతులు

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:12 AM

ఉల్లిపంట రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. మూడు నెలలు కష్టించి పండించిన ఉల్లిపంటకు ధర లేక రైతులు నష్టపోయారు.

   ఉల్లిని వదిలేసిన రైతులు
నగల్లపాడులో ఉల్లిగడ్డలను సంచుల్లోకి వేసుకుంటున్న ప్రజలు

చాగలమర్రి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉల్లిపంట రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. మూడు నెలలు కష్టించి పండించిన ఉల్లిపంటకు ధర లేక రైతులు నష్టపోయారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం నగల్లపాడు గ్రామంలో రైతు రామిరెడ్డి శుక్రవారం పంట పొలంలో ఉల్లి కుప్పలను వదిలేశారు. విషయం తెలుసుకున్న ప్రజలు పొలం వద్దకు వెళ్లి సంచుల్లో ఉల్లిగడ్డలను నింపుకొని తీసుకెళ్లారు. ఉల్లిగడ్డలను గొర్రెలకు మేతగా వదిలేశారు. కోత కోసిన ఉల్లిగడ్డలు వర్షానికి తడిచి దెబ్బతిన్నాయి. దీంతో రైతుకు తీరని నష్టం వాటిల్లింది. కేజీ ధర రూ.2 పలుకుతున్న ఉల్లిగడ్డల కోత కూలి ఎకరాకు రూ.20 వేలు అవుతుండటంతో పంట పొలాల్లోనే వదిలేశామని రైతు రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు ఎకరాలకు రూ.2 లక్షలు ఖర్చు చేశామని, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో పంటను వదిలేశామని అన్నారు. పంట చేతికొచ్చాక ధర పతనం కావడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా ముందుకు రావడం లేదు. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ పంట సాగు చేసుకునేందుకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు కోరారు.

Updated Date - Nov 15 , 2025 | 12:12 AM