రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:39 AM
రైతుల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
చాగలమర్రి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. మండ లంలోని చిన్నవంగలి, పెద్దవంగలి గ్రామాల్లో పెనుగాలుల బీభత్సంతో దెబ్బతిన్న బొప్పాయి, మామిడి, అరటి తోటలను బుధవారం పరిశీలిం చారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఏడీ రామ్మోహనరెడ్డి, తహసీల్దార్ రవికుమార్, ఏవో రంగ నేతాజీ, నాయకులు అన్సర్‌బాషా, నరేంద్ర, రైతులు పాల్గొన్నారు.