రీ సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:04 AM
రైతులు రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రంజితబాషా అన్నారు.

సి. బెళగల్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): రైతులు రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రంజితబాషా అన్నారు. సి. బెళగల్‌లో చేపట్టిన రీసర్వేను కలెక్టర్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు భూసమస్యలు ఉంటే తహసీల్దార్‌తో సంప్రదించి భూమిని కొలుతలు వేయించుకోవాలన్నారు. అలాగే రైతులు భూ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుతికోవాలన్నారు. సమస్యలను పెంచుకుని కోర్టుల చుట్టూ తిరగడం వల్ల రైతులే నష్టపొతారన్నారు. రీసర్వే చేసే సమయంలో రెవెన్యూ అధికారులు తప్పనిసరి రైతులకు సమాచారం అందజేయాలన్నారు. అధికారులు రైతుల సమస్యలను పరిస్కరించకుండా వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్డ్‌డీవో సంధీ్‌పకుమార్, ఇనచార్జి తహసీల్దార్ పురుషోత్తం, సర్వేర్ నాగభూషణం ఉన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారంగా భోజనం వడ్డించాలి
కస్తూర్బాపాఠశాలలో చదువుతున్న బాలికలకు అందజేసే భోజనం మెనూ ప్రకారంగా వడ్డించడం లేదని విద్యార్థినులు తెలిపితే సస్పెండు చేస్తామన్నారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడుతూ విద్యార్థులు చదవుతోపాటు క్రీడాలలో కూడా రాణించాలన్నారు. అనంతరం పాఠశాల స్టొరుమ్, డైనింగ్ అల్, పాఠశాలలో కంపౌండు, తాగునీరు ఇబ్బంది లేకుండా విద్యార్ధినులకు అన్ని మౌలికవసతులు కల్పించాలన్నారు. పాఠశాలలొ నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. కలెక్టర్ ఆర్డ్‌వో సంధీ్‌పకుమార్, ఇనచార్జి తహీసీల్దార్ పురుషోత్తం, ఎంపీడీవో రాణెమ్మ, అధికారులు ఉన్నారు.