Share News

రైతులు పేర్లు నమోదు చేసుకోవాలి: జేసీ

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:49 PM

జిల్లాలోని మొక్కజొన్న అమ్ముకునేందుకు రైతు సేవాకేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకో వాలని జాయింట్‌ కలెక్టర్‌ కొల్లా బత్తుల కార్తీక్‌ సూచించారు.

రైతులు పేర్లు నమోదు చేసుకోవాలి: జేసీ
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని మొక్కజొన్న అమ్ముకునేందుకు రైతు సేవాకేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకో వాలని జాయింట్‌ కలెక్టర్‌ కొల్లా బత్తుల కార్తీక్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని జాయింట్‌ కలెక్టర్‌ చాంబర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై జిల్లా వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖరీ్‌ఫ-2025లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, దీంతో దాదాపు 50 వేల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తులు వస్తాయన్నారు. ప్రభుత్వం నుంచి మొక్కజొన్నల కొనుగోలు ఉత్తర్వులు రాగానే కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. రైతు సేవాకేంద్రాల వద్దనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో వర్ష సూచన ఉందని మొక్కజొన్న కోతలు ఆపుకొనేలా రైతులకు తెలియజేయాలని ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి సంచులు, 25000 టన్నుల గోదాములు అందుబాటులో ఉన్నాయని మార్కెఫెడ్‌ అధికారి తెలిపారు. సమావేశంలో జిల్లా సహకార శాఖ, జిల్లా మార్కెటింగ్‌, జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిన్నింగ్‌ మిల్లులో గిట్టుబాటు ధరకు పత్తిని అమ్ముకోవాలి

జిల్లాలోని రైతులందరూ తాము పండించిన పత్తిని పట్టణంలో ఏర్పాటు చేసిన జిన్నింగుమిల్లులో గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చని జాయింట్‌ కలెక్టర్‌ కొల్లా బత్తుల కార్తీక్‌ తెలిపారు. తన చాంబర్‌లో జిల్లాస్థాయి పత్తి కొనుగోలు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి కనీస మద్దతు ధర రూ.7710 (పొట్టి పింజ రకం), రూ.8110 (పొడవు పింజరకం) కంటే తక్కువ ఉన్నందున పట్టణంలోని శ్రీమురారి పవన ఆగ్రోటెక్‌ జిన్నింగు మిల్లులో కాటన కార్పొరేషన వారు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. పత్తిరైతులు పత్తిని జిన్నింగుమిల్లునకు తీసుకువచ్చి గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చునన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారి అబ్దుల్‌ రెహ్మాన, జిల్లా స్థాయి అధికారులు, జిన్నింగ్‌ మిల్లు ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:49 PM