రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలి
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:28 PM
రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి తమ పంటకు తామే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి తమ పంటకు తామే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. మంగళవారం పట్టణంలోని క్రాంతినగర్‌లో డీపీఏంయూ ఆధ్వర్యంలో జరుగుతున్న టీ-ఐసీఆర్‌పీ ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో లక్ష ఎకరాల్లో వ్యవసాయం విస్తరింపజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ లు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రస్తుతం 50 వేల మంది రైతులు మా త్రమే పాక్షికంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తుండగా, పూర్తిగా ప్రకృతి వ్యవసా యం చేస్తున్న రైతులు 6,000 మంది ఉన్నారని వివరించారు. ప్రకృతి వ్యవసాయం విస్తరణలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఇంటి వద్ద కిచెన గార్డెన్లు, అంగనవాడీ సెంటర్లు, పాఠశాలల్లో పెరటి తోటలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి టీ-ఐసీఆర్‌పీ ఒక ఆదర్శ రైతుగా ఎదిగి ఇతరులను ప్రకృతి వ్యవసాయం వైపు మార్చేలా ప్రేరేపించాలనన్నారు. పొలాల గట్లపై మొక్కలను నాటి పర్యావరణ సమతౌల్యం కాపాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎం సీ మద్దిలేటి, డీపీఎం శ్రీనివాసులు, ఏడీపీఎం అబ్దుల్ సలాం, జిల్లా ఎనఎ్‌ఫఏలు, డీటీటీలు, టీ-ఐసీఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.
కష్టపడితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు
నంద్యాల నూనెపల్లి : కష్టపడే మనస్తత్వం ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవడం సులభమని కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం పట్టణంలోని రైతునగర్ సమీపంలోని ఫంక్షన హాలులో ఇంటర్‌రైజ్ ఇనస్పైర్ అవార్డ్స్- రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. పది, ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపాలంటే విశ్లేషణాత్మకంగా చదవాలన్నారు. ఇటీవల బీసీ బాలికల వసతిగృహంలో టాయిలెట్లు సరిగ్గా లేవని విద్యార్థులు వివరించగా రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే సంస్థ స్పందించి టాయిలెట్లు నిర్మించిందని కలెక్టర్ అభినందించారు. అనంతరం రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ప్రా జెక్టు డైరెక్టర్ మదన మోహన మాట్లాడుతూ.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇంటర్‌రైజ్ ఇనస్పైర్ అవార్డ్సును అందించడం గర్వకారణమన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే మా లక్ష్యమన్నారు. అనంతరం గత విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన 42 మందికి మెమెంటోలు, ప్రశంసాపతత్రాలు అందజేశారు. 20 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కూడా మెమెంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఈవో జనార్దనరెడ్డి, టోల్ ఫ్లాజా మేనేజర్ సుబ్రమణ్యం, ఎక్స్‌ప్రె స్ వే బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.