Share News

రైతులు ఉద్యమించాలి

ABN , Publish Date - May 24 , 2025 | 11:56 PM

రాయలసీమ రతనాల సీమ కావాలంటే సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మించాలని, అందుకు రైతులందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి కోరారు.

రైతులు ఉద్యమించాలి
మాట్లాడుతున్న దశరథరామిరెడ్డి

h సిద్ధేశ్వరం బహిరంగసభ విజయవంతం చేయండి

h రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి

కోవెలకుంట్ల, మే 24 (ఆంధ్రజ్యోతి) : రాయలసీమ రతనాల సీమ కావాలంటే సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మించాలని, అందుకు రైతులందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి కోరారు. శనివారం పట్టణంలో విశ్రాంత గ్రంథాలయ అధికారి పల్లె నరసింహారెడ్డితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 31న సిద్ధేశ్వరం వద్ద నిర్వహించనున్న బహిరంగసభ విజయవంతం చేయాలని కోరారు. మండల పరిధిలోని పొట్టిపాడు గ్రామానికి చేరుకుని శివాలయం వద్ద గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రైతులను బహిరంగసభకు ఆహ్వానించారు. కార్యక్రమంలో నరహరి, భాస్కర్‌రెడ్డి, వీరభద్రారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

‘సిద్ధేశ్వరం’ ఆందోళనకు సీపీఐ సంపూర్ణ మద్దతు

డోన టౌన: సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు కోసం జరిగే ఆందోళనకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే.రామాం జనేయులు, జిల్లా కార్యదర్శి ఎన.రంగనాయుడు అన్నారు. శనివారం స్థా నిక నక్కిరామన్న భవనలో వారు విలేకరుల సమావేశం నిర్వహించి మా ట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముం దు వ్యవసాయ భూముల గురించి, సాగునీటి ప్రాజెక్టుల గురించి మా ట్లాడుతారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి మాట్లాడరని ఆరోపించారు. గుండ్రేవుల, అలగనూరు రిజర్వాయర్‌, గోరు కల్లు రిజర్వాయర్‌ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉమ్మడి జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టు ను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచర్ల ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తామ ని చెప్పడం ఇక్కడి ప్రజలను మోసం చేయడమే అని అన్నారు. కృష్ణా జలాల బోర్డును రాయలసీమలో ఏర్పాటు చేయాలని, హంద్రీనీవా ప్రాజెక్టు స్థిరీకరణకు కృషి చేయాలన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయాలని ఎన.రంగనాయుడు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుంకయ్య, రాధాకృష్ణ; బి.నారాయణ, పులిశేఖర్‌, ఎనకే రామ్మోహన, ఎం.పుల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 11:56 PM