నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:19 PM
జిల్లాలో కురిసిన అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ డిమాండ్ చేశారు.
ఆత్మకూరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కురిసిన అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఇనచార్జి ఏడీఏ హేమలతకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన మూడు నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పొలాల్లో నీరు నిలిచి పంటలన్నీ దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఎకరాకు రూ.40వేల పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రబీ సీజనకు సంబంధించి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆసంఘం నాయకులు మాబాషా, వీరన్న, మహెబూబ్ తదితరులున్నారు.