Share News

రైతులు బాగుండాలి

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:06 AM

‘రైతులు బాగుండాలి. వారు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వం లక్ష్యం..’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

   రైతులు బాగుండాలి
ఎంబాయి గ్రామంలో సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌

వారి సంక్షేమమే ధ్యేయం

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌

బేతంచెర్ల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘రైతులు బాగుండాలి. వారు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వం లక్ష్యం..’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. బేతంచెర్ల మండలంలోని ఎంబాయి గ్రామంలో జరిగిన ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన’ జిల్లా స్థాయి కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, కలెక్టర్‌ రాజకుమారి, డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి హాజరయ్యారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాకు సంబందించి మొత్తం రూ.2,06,052 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.103.03 కోట్ల మెగా చెక్కును విడుదల చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక మాత్రమే కాకుండా జాతీయ ఆర్థిక వ్యవస్థకు పునాది అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు కుటుంబానికి నేరుగా ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ రాబోయే ఆరు నెలలో డోన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి ఇప్పిస్తామని కోట్ల హామీ ఇచ్చారు. రైతులు పంట సాగు నుంచిమార్కెట్‌ వరకు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రభుత్వం గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఈ సందర్భంగా డోన నియోజకవర్గానికి చెందిన 3,5011 మంది రైతులకు రూ.23.63 కోట్ల చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన వై.నాగేశ్వరరావు యాదవ్‌, వ్యవసాయశాఖ ఏడీఏ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు కోట్ల రాఘవేంద్ర రెడ్డి, ఆర్డీఓ నరసింహులు, డోన అబ్జర్వర్‌ కేసీ హరి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:06 AM