Share News

రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:51 PM

దేశంలో ఎన్డీయే సర్కార్‌ జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహదం చేస్తుందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు.

రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి
ర్యాలీలో భాగంగా ట్రాక్టర్‌ నడిపిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు రూరల్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎన్డీయే సర్కార్‌ జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహదం చేస్తుందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. సూపర్‌జీఎస్టీ, సూపర్‌ సేవింగ్‌ అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తగ్గిన జీఎస్టీపై భారీ ట్రాక్టర్‌ర్యాలీని చేపట్టారు. స్థానిక టీబీ రోడ్డులోని మార్కెట్‌యార్డు నుంచి ప్రారంభమైన ర్యాలీని ఎమ్మెల్యే పచ్చజెండా ఊపి ప్రారంభించి స్వయంగా ఎమ్మెల్యే ట్రాక్టర్‌ నడిపారు. ర్యాలీలో ఏడీఏ అనిత, ఏవో వరిహరికుమార్‌, వారి సిబ్బందితో రైతులకు చేకూరిన ప్రయోజనాలను సూచించే ప్లకార్డులతో ర్యాలీ ముందుకు సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీఎస్టీ తగ్గడంతో వ్యవసాయ యంత్రాలపై ధరలు తగ్గి రైతుకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌, మాజీ జడ్పీటీసీ తోట మహేష్‌, వక్ఫ్‌బోర్డు రాష్ట్ర డైరెక్టర్‌ జాకీర్‌ అహమ్మద్‌, జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ జ్ఞానేంద్రారెడ్డి, బీజేపీ నాయకుడు వంకధార నరేంద్రరావు, జనసేన నాయకులు జిలాన్‌, కూటమి నేతలు, ట్రాక్టర్‌ కంపెనీల డీలర్లు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2025 | 11:51 PM