Tadepalligudem: దొండ కారు
ABN , Publish Date - Aug 10 , 2025 | 06:00 AM
కారులో షికారుకు వెళ్లడం అందరూ చేసేదే. కారులో కూరగాయలు తీసుకెళ్లడం.. గోదావరి జిల్లాల రైతులకే సాధ్యం.
కారులో షికారుకు వెళ్లడం అందరూ చేసేదే. కారులో కూరగాయలు తీసుకెళ్లడం.. గోదావరి జిల్లాల రైతులకే సాధ్యం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటకు చెందిన ఓ రైతు తన చేలో పండించిన దొండకాయలను మారుతీ కారులో 15 కిలోమీటర్ల దూరంలోని గూడెం మార్కెట్‌కు తీసుకెళ్తున్నారు. గతంలో బైక్, ఆటోల్లో కూరగాయలు మార్కెట్‌కు తీసుకెళ్లగా.. ఎల్పీజీ గ్యాస్‌తో నడిచే కారు కావడంతో రవాణా ఖర్చులు కలిసొస్తాయని, పాతబడిన కారును ఇలా వాడేస్తున్నారు. ఈ కారులో పది బస్తాల దొండకాయలు తీసుకెళుతున్నారు. పది కేజీల దొండకాయలకు రూ.200 వస్తోందని రైతు చెప్పారు.
- (తాడేపల్లిగూడెం రూరల్, ఆంధ్రజ్యోతి)