Chairman of Swachhandra Corporation: అదే కుట్ర.. అదే కుతంత్రం
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:19 AM
సొంత బాబాయి వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో హత్య చేసి ఎలా బుకాయించి నిందను చంద్రబాబు మీద వేశారో.. లిక్కర్ స్కాంలోనూ జగన్ అదే పంథా అనుసరిస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి విమర్శించారు.
వివేకా హత్య తరహాలో..మద్యం స్కామ్‌పైనా తప్పుడు ప్రచారం
నాడు వివేకా.. నేడు వెంకటేశ్‌నాయుడు
రోజుకో అబద్ధంతో చంద్రబాబుపై నిందను నెట్టే యత్నం
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఫైర్
అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): సొంత బాబాయి వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో హత్య చేసి ఎలా బుకాయించి నిందను చంద్రబాబు మీద వేశారో.. లిక్కర్ స్కాంలోనూ జగన్ అదే పంథా అనుసరిస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి విమర్శించారు. మం గళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. నాడు వివేకా హత్య కేసులో ఏం జరిగిం ది.. నేడు మద్యం స్కాం నిందితుడైన వెంకటేశ్‌నాయుడి విషయంలో ఏం జరుగుతోందనే అం శాలను వీడియో ద్వారా పట్టాభి వివరించారు. ‘మద్యం కుంభకోణం లో పక్కా ఆధారాలతో నిందితులను సిట్ పట్టుకుంటుంటే.. ఎక్కడ జైలు కు వెళ్లాల్సి వస్తుందోనని భయపడుతున్న జగన్.. వెంకటేశ్ చంద్రబాబు మనిషి అంటూ బుకాయిస్తున్నారు. వివేకా హత్య నాటి కుట్ర, కుతంత్రాలను లిక్కర్ స్కాంలోనూ అమలు చేస్తున్నారు. వివేకా హత్య కేసులో రోజుకో అబద్ధం చెప్పి ఎలాగైతే ప్రజల్ని తప్పుదారి పట్టించారో, చంద్రబాబుపై నింద వేశారో.. మద్యం స్కాంలోనూ అదే దారిలో వెళ్తున్నారు. సిట్ దాఖలు చేసిన చార్జిషీటులో గోవిందప్ప బాలాజీ, విజయసాయిరెడ్డి, మిఽథున్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, సైమన్ ను వెంకటేశ్‌నాయుడు కలిసినట్లు అన్ని సాంకేతిక ఆధారాలూ చూపింది. ఎవరెవరి ని ఏ సమయంలో, ఏ ప్రదేశంలో కలిశాడో కూడా పూర్తి ఆధారాలను అందులో పొందుపరచింది. అతడికి, వైసీపీకి సంబంధం లేకుంటే ఆ నేతలను కలవాల్సిన అవసరం ఏముంది? చెవిరెడ్డికి వెంకటేశ్ సన్నిహితుడని తొలుత ఒప్పుకొన్న జగన్ మీడియా.. అడ్డంగా దొరికాక అతడు టీడీపీ మనిషి అం టూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. చేతిలో అవినీతి పత్రిక ఉందని ఏది పడితే అది రాస్తే నిజం అబద్ధం అయిపోతుందా? ఒక్క వైసీపీ నేతైనా చేతిలో చార్జిషీటు పట్టుకుని అందులో ఉన్నవి అబద్ధాలని నిరూపించగలరా? ఆ అం శాలు నిజం కాదని ఆ పార్టీ నేతలెవరైనా చర్చ కు రాగలరా’ అని పట్టాభి సవాల్ విసిరారు.