Local Leaders Exposed: అంతా కలిసే చేశారు!
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:52 AM
తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతోనే అద్దేపల్లి జనార్దన్‌రావు, జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్ది గిరిధర్‌రెడ్డి, కట్టా సు రేంద్రనాయుడు..
తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించాలనే ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ
జనార్దన్‌రావు పథకానికి జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి సరేనన్నారు
జయచంద్రారెడ్డి చెప్పారనే ఫోన్లు ధ్వంసం
ఎక్సైజ్ పోలీసులకు పీఏ రాజేశ్ వాంగ్మూలం
రాయచోటి/ములకలచెరువు, డిసెంబరు 10 (ఆం ధ్రజ్యోతి): ‘‘తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతోనే అద్దేపల్లి జనార్దన్‌రావు, జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్ది గిరిధర్‌రెడ్డి, కట్టా సు రేంద్రనాయుడు.. అంతా కలిసే ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు చేశారు. ఈ విషయాలు తెలిసినా మౌనంగా ఉన్నా. నకిలీ మద్యం త యారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసుల దాడి అనంతరం పరారీలో ఉన్న నేను జయచంద్రారెడ్డి సూచనల మేరకు రెండు ఫోన్లను ధ్వంసం చేశా’’ అని పార్టీ నుంచి సస్పెండైన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్ ఎక్సైజ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అన్నమయ్య జి ల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి జయచంద్రారెడ్డి పీఏ తిమ్మిరెడ్డిగారి రాజేశ్(ఏ5)ను అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి తంబళ్లపల్లె కోర్టులో హాజరు పరిచగా 14 రోజులు రిమాండ్ విధించడంతో మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. రాజేశ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయి. పీటీఎం మండలం మల్లెల గ్రామానికి చెందిన రాజేశ్ బీఎస్సీ అగ్రికల్చర్ వరకు చదివాడు. గుడివాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో కొంతకా లం పనిచేశాడు. తరువాత ఉద్యోగాన్ని వదిలేసి స్వగ్రామానికి వచ్చి ఏడాది పాటు ఖాళీగా ఉన్నాడు. 2019-22 వరకు బి.కొత్తకోటలో ఓ వ్యాపారం ప్రారంభించి నష్టం రావడంతో మూసేశాడు. 2023 నుంచి జయచంద్రారెడ్డికి పీఏగా పనిచేస్తున్నా డు. 2024లో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి టికెట్ రావడంతో ప్రచార కార్యక్రమాలు, సమావేశాలకు సంబంధించిన పనులు చూసేవాడు. జయచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో అద్దేపల్లి తరచూ పాల్గొనేవాడు. 2024 అక్టోబరులో రాజేశ్ పేరు మీద జయచంద్రారెడ్డి, ఆయన బామ్మ ర్ది గిరిధర్‌రెడ్డి మద్యం దుకాణానికి దరఖాస్తు చేయ గా వచ్చింది. ఈ దుకాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను జయచంద్రారెడ్డి వాళ్లే చూసుకునేవా రు. ఈ దుకాణంతో పాటు పీటీఎం మండలంలో సురేంద్రనాయుడు దక్కించుకున్న షాపులో కూడా నష్టాలు వస్తుండటంతో రెండింటినీ చూసుకుంటానని అద్దేపల్లె జనార్దన్‌రావు(ఏ1) ముందుకొచ్చాడు. దీనికి గిరిధర్‌రెడ్డి అంగీకరించి అప్పగించాడు. బెంగళూరుకు చెందిన బాలాజీ ద్వారా స్పిరిట్, ముడిపదార్థాలు కొనుగోలు చేసి నకిలీ మద్యం తయారు చేసి అమ్మితే అధిక లాభాలు వస్తాయని జనార్దన్‌రావు చెప్పడంతో జయచంద్రారెడ్డి (ఏ17), గిరిధర్‌రెడ్డి(ఏ18), సురేంద్రనాయుడు(ఏ14) అంగీకరించారు. ఈ ఏడాది జూన్-జూలై నుంచి జనార్దన్‌రావు, గిరిధర్‌రెడ్డి, సురేంద్రనాయుడు ములకలచెరువులో చేపట్టిన న కిలీ మద్యం తయారీకి జయచంద్రారెడ్డి మద్దతు ఇచ్చాడు. మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్ సరఫరా చేసిన బాలాజీ కుమారుడు సుదర్శన్‌కు రాజేశ్ ఖాతా నుంచి రూ.లక్ష పంపా రు. జనార్దన్‌రావు సూచనల మేరకు బాలరాజు(ఏ4), ఆష్ర ఫ్(ఏ21) మద్యం దుకాణాలకు నకిలీ మద్యం సరఫ రా చేశారు. పీటీఎం మండలానికి చెందిన చైతన్యబాబు(ఏ22) సురేంద్రనాయుడు మద్యం దుకాణం లో పనిచేస్తూ బెల్ట్‌షాపులకు నకిలీ మద్యం సరఫరా చేశాడు. రూ.5 లక్షలు కట్టి రాజేశ్ పేరుతో ఓ వాహ నం కొనుగోలు చేశారు. ఆ వాహనం ద్వారా నకిలీ మద్యం సరఫరా చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, తం బళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట, బి.కొత్తకోట మండలాలకు సరఫరా జరిగింది. నకిలీ మద్యం కేసు నమోదైన వెంటనే జయచంద్రారెడ్డి సూచనల మేరకు రాజేశ్ సెల్‌ఫోన్ల డేటాను తొలగించాడు. కాగా, రాజేశ్‌ను నుంచి ఓ కీప్యాడ్ సెల్‌ఫోన్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.