Share News

Remand Extension: నకిలీ మద్యం నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - Dec 10 , 2025 | 06:37 AM

నకిలీ మద్యం కేసులో వివిధ జైళ్లలో ఉన్న నిందితులకు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు...

Remand Extension: నకిలీ మద్యం నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

విజయవాడ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కేసులో వివిధ జైళ్లలో ఉన్న నిందితులకు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి జి.లెనిన్‌బాబు 18 వరకు రిమాండ్‌ను పొడిగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు, మాజీ మంత్రి జోగి రమేశ్‌, రాము సోదరులు, తిరుమలశెట్టి శ్రీనివాసరావుతో పాటు కొంతమంది నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. మొత్తం 17 మంది నిందితులను జైలు అధికారులు వర్చువల్‌గా న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు.

Updated Date - Dec 10 , 2025 | 06:37 AM