కల్తీ మద్యం వ్యాపారులు జగన్ బినామీలే: వర్ల
ABN , Publish Date - Oct 12 , 2025 | 06:32 AM
వైసీపీ పాలనలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కల్తీ మద్యానికి మూల కారణం జగన్ అని, ఇక్కడ సరిపోక కల్తీ మద్యం వ్యాపారాన్ని సౌతాఫ్రికాకు విస్తరించారని, తన బినామీలతో అక్కడ కల్తీ మద్యం వ్యాపారం చేయించారని ఆరోపించారు. జయచంద్రారెడ్డిని ఎన్నికలకు ముందు టీడీపీలోకి వైసీపీ కోవర్టుగా పంపారని ఆరోపించారు.