Share News

Disability scam: ఫేక్‌ డ్రామా రట్టు

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:27 AM

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పి.రమేశ్‌. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నారసింపల్లి గ్రామం. ఈ ఫొటో చూడగానే పాపం ఒక చెయ్యి లేదని అనుకుంటారు కదూ..!

Disability scam: ఫేక్‌ డ్రామా రట్టు

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పి.రమేశ్‌. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నారసింపల్లి గ్రామం. ఈ ఫొటో చూడగానే పాపం ఒక చెయ్యి లేదని అనుకుంటారు కదూ..! తాను దివ్యాంగుడినని, అన్యాయంగా తన పింఛన్‌ తీసేశారని అతను సెల్ఫీ వీడియోను ‘పుష్ప.. ద మాస్‌’ పేరిట సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. అసలు విషయం ఏంటంటే.. అతను దివ్యాంగుడు కాదు. రెండు చేతులూ బాగున్నాయి. చక్కగా పొలం పనులు కూడా చేసుకుంటున్నాడు. వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త అయిన రమేశ్‌ కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడానికే ఇలా దుష్ప్రచారానికి ఒడిగట్టాడు. తన చెయ్యి వెనక్కి మడత పెట్టి చొక్కాలో దాచుకుని డ్రామా ఆడాడు. అతను దివ్యాంగుడు కాదని చెప్పడానికి కుడి పక్క ఫొటోనే తిరుగులేని సాక్ష్యం. ఇందులో ఒక చేత్తో గొడుగు పట్టుకుని, ఇంకో చెయ్యి పైకి ఎత్తి ఉన్న వ్యక్తి కూడా రమేశే. గత వైసీపీ ప్రభుత్వంలో అతడికి పింఛన్‌ రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసేసిందీ లేదు. కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు తమ సోషల్‌ మీడియా కార్యకర్తల ద్వారా ఇలాంటి ఫేక్‌ వీడియోలు చేయించి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. వైసీపీ సైకోయిజం బాగా వంటబట్టించుకున్న రమేశ్‌.. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను నరుకుతానని బెదిరిస్తూ, దుర్భాషలాడుతూ వీడియోలు పెట్టాడు.

- బుక్కపట్నం, ఆంధ్రజ్యోతి

Updated Date - Aug 23 , 2025 | 05:30 AM