Excise Department: గుంటూరులో రూ.కోటి నకిలీ సిగరెట్లు స్వాధీనం
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:35 AM
ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ సిగరెట్లు తయారు చేస్తున్న వారి గుట్టును సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు రట్టుచేశారు.
ప్రముఖ బ్రాండ్ల పేరుతో తయారీ
గుంటూరు(కార్పొరేషన్), అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ సిగరెట్లు తయారు చేస్తున్న వారి గుట్టును సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు రట్టుచేశారు. బుధవారం రాత్రి గుంటూరులోని కాకాని రోడ్డులో ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్ షాపు నంబరు 106లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. కోటి విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాన్ని సీజ్ చేశారు. ఇక్కడ ప్రముఖ బ్రాండ్ల పేరుతో సిగరెట్లను తయారు చేసి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.