Acharya NG Ranga Agricultural University: ఎన్నారై, రైతు కోటా సీట్ల దరఖాస్తు గడువు పెంపు
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:22 AM
రాష్ట్రంలో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ఎన్నారై కోటా సీట్లతోపాటు బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్....
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ఎన్నారై కోటా సీట్లతోపాటు బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో రైతుకోటా సీట్లకు దరఖాస్తు గడువును ఈనెల 30 వరకు పెంచినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ర్టార్ ఎంవీ రమణ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఆ కోర్సుల్లో ఆయా కోటాల కింద దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు.