ఎల్‌ఆర్‌ఎస్ ప్రయోజనాలను వివరించాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:19 PM
రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకు వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ను వినియో గదారులు సద్వినియోగం చేసు కునేలా అవగాహన కల్పించా లని మున్సిపల్ కమీషనర్ బేబి సూచించారు.
నందికొట్కూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకు వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ను వినియో గదారులు సద్వినియోగం చేసు కునేలా అవగాహన కల్పించా లని మున్సిపల్ కమీషనర్ బేబి సూచించారు. మంగళవారం పట్టణం లోని ప్యారడైజ్ ఫంక్షన హాల్ వద్ద టౌన ప్లానింగ్ అధికారులతో సమావేశంలో నిర్వ హించారు. ఈ సందర్భంగా కమిషనర్ బేబి, టీపీవో రంగస్వామి మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా వెలసిన వెంచర్లలో స్థలాలు తీసుకున్న లబ్ధిదారులు, అక్రమ వెంచర్ వ్యాపారులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఒక చక్కటి అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈ విధానం ద్వారా ఎలాంటి అనుమతులు లేని స్థలాలను ఈ ఎల్‌ఆర్‌ఎస్ విధానం ద్వారా సక్రమం చేసుకోవచ్చన్నారు. ఈ విషయాన్ని పట్టణ ప్రజలకు వివరిస్తూ ఎల్‌ఆర్‌ఎస్ విధానాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం పట్టణంలో పలు సెంటర్‌లలో టౌన ప్లానింగ్ అధికారులు స్టాల్స్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు ఎల్‌ఆర్‌ఎస్ విధానంపై అవగాహన కల్పించారు.